News April 2, 2024
వరంగల్ మార్కెట్‌లో పలు ఉత్పత్తుల ధరలు ఇలా..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు పలు ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. నం.5 రకం మిర్చి క్వింటాకి రూ.13 వేలు, సింగిల్ పట్టి రకం క్వింటాకు రూ.42,500 పలికింది. అలాగే మక్కలు క్వింటాకు రూ.2,175 ధర పలికాయి. కాగా గతవారంతో పోలిస్తే ఈరోజు మక్కల ధర భారీగా తగ్గింది. ఎండ తీవ్రత నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News April 19, 2025
వరంగల్: ‘అత్తాన, పోతాన’.. ఇదే మన యాస, భాష

ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు ఉంటుంది. WGL, KNR జిల్లాల్లో మాత్రం భాష కాస్త భిన్నంగా ఉంటుంది. KNR వారు అకారంతో మాట్లాడితే WGLలో ఒకారంతో మాట్లాడతారు. KNRలో వడ్లు అంటే WGLలో ఒడ్లు అంటాం. వేరే జిల్లాల్లో వస్తున్నా, వెళ్తున్నా అంటే మనం మాత్రం ‘అత్తాన, పోతాన’ అంటుంటాం. అచ్చిన, అట్లనా, అవ్వ, నాయిన, అప్పయ్య, జర ఆగు, షానా(చాలా), పైలం, బువ్వ అనే పదాలు వాడుతుంటాం. మీరెలా మాట్లాడుతారో కామెంట్ చేయండి.
News April 19, 2025
మన ‘పాకాల’ నీరు.. సముద్రంలో కలుస్తోందిలా!

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు వరద నీరు 192 కి.మీ ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ‘పాకాల’ వాగు.. ప్రవాహ క్రమేణా ‘మున్నేరు’గా మారి ఏపీలోని కంచికచర్ల వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా బంగాళాఖాతం సముద్రంలో కలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంత రైతులకు, ప్రజలకు పాకాల నీరు జలవనరుగా ఉంది.
News April 19, 2025
వరంగల్ సీపీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మైనర్లతో పాటు ఎలాంటి లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే వారిపై చర్యలు తప్పవని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో మైనర్లను ప్రోత్సహించిన, వాహనాలు అందజేసినా యజమానులపై చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.