News July 11, 2024

వరంగల్ మార్కెట్‌లో పెరిగిన పసుపు, పల్లికాయ ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు క్వింటా పసుపు ధర భారీగా పెరిగింది. నిన్న రూ.12,501 పలికిన పసుపు నేడు రూ. 13,759 పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ. 6160 (నిన్న రూ.6110) పలకగా.. పచ్చి పల్లికాయ ధర రూ.4550 (నిన్న రూ.4300) పలికింది. మరోవైపు 5531 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.13వేల ధర వచ్చింది.

Similar News

News October 14, 2025

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఘన స్వాగతం

image

వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు బయలుదేరారు. మార్గమధ్యంలో ఖాజీపేట రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి, ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలను రాంచందర్‌రావు పలకరించి, ముందుకు సాగారు.

News October 12, 2025

వరంగల్: 97%తో రికార్డు స్థాయిలో పల్స్ పోలియో

image

నేటి ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగింది. మొత్తం 20,101 మంది పిల్లలకు లక్ష్యంగా, 19,546 మందికి పోలియో వ్యాక్సిన్ వేసి 97 శాతం రికార్డు సాధించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.సాంబశివరావు తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పక వేయించాలన్నారు.

News October 12, 2025

పదో వసంతంలోకి వరంగల్ జిల్లా..!

image

వరంగల్ జిల్లా 2016 అక్టోబర్ 11న ఏర్పాటైంది. నిన్నటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న జిల్లా నేటి నుంచి పదో వసంతంలోకి అడుగు పెట్టింది. కాగా కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత అభివృద్ధి పనులు జరిగాయని కొందరు.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మరికొందరు అంటున్నారు. గ్రామీణ రోడ్లు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వ భవనాలు, స్కూళ్లు, హాస్టళ్లు సరిగా లేవని చెబుతున్నారు. మీ జిల్లా అభివృద్ధి అయ్యిందా కామెంట్ చేయండి.