News July 10, 2024
వరంగల్ మార్కెట్లో పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర క్రమంగా పెరుగుతోంది. సోమవారం రూ.7,200 పలికిన క్వింటా పత్తి.. మంగళవారం రూ.7,240 అయింది. ఈరోజు మరింత పెరిగి రూ.7,400 అయినట్లు అధికారులు తెలిపారు. ధరలు పెరగడం కొంత ఉపశమనం కలిగించే విషయమైనప్పటికీ, మరింత పెరగాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.
Similar News
News November 15, 2025
వయోవృద్ధులను గౌరవిద్దాం: WGL కలెక్టర్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుంచి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు వయోవృద్ధుల వాకథాన్(ర్యాలీ) జరిగింది. కలెక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా పాల్గొని, జెండా ఊపి ప్రారంభించారు. ఈనెల 19 వరకు జిల్లాలో వారోత్సవాలను నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
News November 15, 2025
WGL: టెన్త్ పరీక్షల ఫీజు గడువు 20 వరకు పొడిగింపు

పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈఓ రంగయ్య నాయుడు తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో 21 నుంచి 29 వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టులకు రూ.110, 3 కంటే ఎక్కువైతే రూ.125, వొకేషనల్ వారికి అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫీజులు కేవలం www.bse.telangana.gov.inలో లాగిన్ ద్వారా చెల్లించాలని సూచించారు.
News November 15, 2025
పాకాల: ధాన్యం కొనుగోళ్లలో కఠిన నిబంధనలు..!

వరంగల్ జిల్లా పాకాల ఆయకట్టు పరిధిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకుండానే రైతులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. జల్లెడ వేసిన ధాన్యానికే టోకెన్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశాలు రావడంతో రైతులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. తాలు, మట్టి, పాడైన ధాన్యం 5% లోపే ఉండాలన్న నిబంధనలు, మిల్లర్ల కేటాయింపు ఆలస్యం రైతులకు తలనొప్పిగా మారాయి. నిబంధనలు పాటించకపోతే కొనుగోలు చేయబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.


