News August 7, 2024

వరంగల్ మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు మంగళవారం రూ.18,500 పలకగా.. నేడు రూ.17,500కి తగ్గింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14 వేలు పలకగా.. నేడు రూ.15 వేలకు చేరింది. నిన్న రూ.14,800 ధర పలికిన వండర్ హాట్(WH) మిర్చి.. నేడు రూ.15,500కి పెరిగింది.

Similar News

News November 28, 2024

దివ్యాంగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క

image

హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగులు పట్టుదలతో ఉండి, అనుకున్నది సాధించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని తెలియజేశారు. 

News November 27, 2024

భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్

image

భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి చెరువులో చేపట్టిన పూడికతీత పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలు పరిశీలించారు.

News November 27, 2024

విజయోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి: ములుగు కలెక్టర్

image

ప్రజా పాలన, విజయోత్సవాల కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన, విజయయోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఈనెల 29న స్థానిక డిఎల్ఆర్ గార్డెన్‌లో విజయోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు.