News March 18, 2025
వరంగల్ మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారంతో పోలిస్తే మంగళవారం మిర్చి ధరలు సైతం పెరిగాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.13,500 ధర రాగా.. నేడు రూ.13,650 పలికింది. 341 రకం మిర్చికి సోమవారం రూ.13,000 ధర రాగా ఈరోజు రూ. 13,100 ధర వచ్చింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి క్వింటా నిన్న రూ.15,800 పలకగా ఈరోజు రూ.16 వేలు వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News March 19, 2025
నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి

TG: ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క నేడు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో 2025-26 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఏడాది పద్దులు రూ.3లక్షల కోట్లకు పైగానే ఉండనున్నట్లు సమాచారం. 2024-25 పద్దు రూ.2.90 లక్షల కోట్లు కాగా ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ఇదే.
News March 19, 2025
యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్

TG: యాదగిరిగుట్ట నరసింహస్వామి క్షేత్రాన్ని మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా దర్శించుకున్నారు. భారతీయత ఉట్టిపడేలా బొట్టు పెట్టుకొని, సంప్రదాయ చీరలో కనిపించారు. ఆలయ నిర్మాణ శైలికి ముగ్ధులయ్యారు. నరసింహుడిని దర్శించుకోవడం ఆనందాన్నిస్తోందన్నారు. కాగా చెక్ రిపబ్లికన్‌కు చెందిన ఈమె 2024లో టైటిల్ గెలిచారు. ఇక ఈ ఏడాది మే 7 నుంచి 31 వరకు HYDలో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి.
News March 19, 2025
బడ్జెట్‌లో నిజామాబాద్‌కు కావాలి నిధులు

తెలంగాణ అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిజామాబాదు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీ, సారంగాపూర్ శేఖర్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలి. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి మరమ్మతులు, ఆసుపత్రిలో పరికరాల కోసం నిధులు కేటాయించాలి. తాగు, సాగునీటి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.