News July 11, 2024

వరంగల్ మార్కెట్‌లో పెరిగిన పసుపు, పల్లికాయ ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు క్వింటా పసుపు ధర భారీగా పెరిగింది. నిన్న రూ.12,501 పలికిన పసుపు నేడు రూ. 13,759 పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ. 6160 (నిన్న రూ.6110) పలకగా.. పచ్చి పల్లికాయ ధర రూ.4550 (నిన్న రూ.4300) పలికింది. మరోవైపు 5531 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.13వేల ధర వచ్చింది.

Similar News

News February 7, 2025

ఎస్టీపీ ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలి: కలెక్టర్

image

ఎస్టీపీ ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని వరంగల్ & హనుమకొండ కలెక్టర్లు సత్య శారద, ప్రావీణ్య అన్నారు. కుడా కార్యాలయంలోని సమావేశ మందిరంలో బల్దియా ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మురుగు నీటి నిర్వహణ వ్యవస్థ ఎస్టీపీల ఏర్పాటు కోసం స్థలాలు గుర్తింపుపై అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. 2055 సంవత్సరానికి గాను 21.31 లక్షల జనాభాకు అవసరమయ్యే డ్రైనేజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు.

News February 6, 2025

చెత్తను వేరుగా అందించడంపై అవగాహన కల్పించాలి: బల్దియా కమిషనర్

image

తడి పొడి చెత్తను వేరుగా అందించడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అభిప్రాయపడ్డారు. మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో నిర్వహిస్తున్న సిగ్రిగేషన్ కంపోస్ట్ యూనిట్లను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర వ్యాప్తంగా సమగ్ర శానిటేషన్ విధానాలను అవలంభించడానికి ప్రయోగాత్మకంగా 6, 49వ డివిజన్లను ఎంపిక చేసి, కంపోస్టు యూనిట్లు చేర్చడం ద్వారా ఎరువుగా మార్చడం చేయాలన్నారు.

News February 6, 2025

కేసముద్రం: రైలు నుంచి జారి పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

image

రైలు నుంచి జారి పడి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. పరకాలకు చెందిన అరవింద్ అనే యువకుడు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడ్డాడు. దీంతో అరవింద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!