News February 12, 2025
వరంగల్ మార్కెట్లో భారీగా పతనమైన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర భారీగా పతనమైంది. నిన్న మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.110 ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 28, 2025
MHBD: భూమి పేరు మార్పిడికి లంచం డిమాండ్

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర తహశీల్దార్ మహేందర్ <<18414245>>లంచం<<>> తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. పోచంపల్లి పడమటి తండాకు చెందిన రైతు భూక్య బాలు తండ్రి పేరిట ఉన్న 3.09 గుంటల వ్యవసాయ భూమిని తన పేరు మీదకు మార్చడానికి తహశీల్దార్ రూ.25 వేలు డిమాండ్ చేయగా, రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.
News November 28, 2025
నాన్-ఏసీ కోచ్ల్లోనూ దుప్పటి, దిండు

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.
News November 28, 2025
సిద్దిపేట: గంగాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపైకి ద్విచక్ర వాహనం ఎక్కి కిందపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


