News March 13, 2025
వరంగల్ మార్కెట్లో భారీగా తగ్గిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు భారీగా తగ్గాయి. తేజ మిర్చి క్వింటాకి బుధవారం రూ.13,400 ధర రాగా.. నేడు రూ.13,300కి తగ్గింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.13,100 ధర రాగా.. నేడు రూ.12,500 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చి నిన్న రూ.16,500 ధర పలకగా ఈరోజు రూ.16,100 పలికినట్లు వచ్చినట్లు వ్యాపారస్తులు తెలిపారు.
Similar News
News December 9, 2025
ఫ్యూచర్ సిటీతో 13 లక్షల ఉద్యోగాలు: శ్రీధర్ బాబు

TG: దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రపంచస్థాయి నగరంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయనున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ‘13,500 ఎకరాల్లో జీరో కార్బన్ సిటీగా దీన్ని రూపొందిస్తాం. ఇక్కడి సంస్థల ద్వారా 13L మందికి ఉద్యోగాలు వస్తాయి. 9 లక్షల జనాభాకు వీలుగా గృహ నిర్మాణం జరుగుతుంది. డేటా సెంటర్లకు 400 ఎకరాలిస్తాం’ అని వివరించారు. అద్భుత ఆర్కిటెక్చర్ అర్బన్ ఫారెస్టులు ఉంటాయన్నారు.
News December 9, 2025
నెల్లూరు: బలమైన కారణాలు కావాలా.. విలువలకు లేదా..!

నెల్లూరు జిల్లా అంటే లక్షలాదిమందికి ఎమోషన్. కానీ ఇది అవసరం లేదంట. బలమైన కారణం కావాలంట. కలువాయ, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలిపే ఆలోచనలో వ్యతిరేకత మొదలైంది. ఈక్రమంలో వచ్చే అభ్యంతరాల్లో కండలేరు రిజర్వాయర్, జిల్లాకేంద్రంతో దూరం, చారిత్రక ఆధారాలు వంటి వాటితో పాటు బలమైన అంశాలు తెలియజేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లందుకు ప్రాధాన్యం ఉంటుందనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.
News December 9, 2025
కోడి పిల్లలను వదిలాక షెడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్ల షెడ్లో ప్రతి 50 కోడి పిల్లలకు ఒక మేత తొట్టి, నీటి తొట్టి అమర్చాలి. తొలి వారంలో 50 పిల్లలకు 24 అంగుళాల మేత తొట్టి సరిపోతుంది. ప్రతి బ్రూడరు కింద 3-4 నీటి తొట్లను అమర్చాలి. వాటిని రోజూ శుభ్రపరచి నీటితో నింపాలి. కోడి పిల్లలను ఉంచిన షెడ్లో రాత్రంతా లైట్లను ఆన్లో ఉంచాలి. కోడి పిల్లలకు తొలి 7-10 రోజుల మధ్య ముక్కును కత్తిరిస్తే అవి ఒకదానినొకటి పొడుచుకోవడం, తొట్లలో మేతను కిందకు తోయడం తగ్గుతుంది.


