News March 13, 2025

వరంగల్ మార్కెట్లో భారీగా తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు భారీగా తగ్గాయి. తేజ మిర్చి క్వింటాకి బుధవారం రూ.13,400 ధర రాగా.. నేడు రూ.13,300కి తగ్గింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.13,100 ధర రాగా.. నేడు రూ.12,500 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చి నిన్న రూ.16,500 ధర పలకగా ఈరోజు రూ.16,100 పలికినట్లు వచ్చినట్లు వ్యాపారస్తులు తెలిపారు.

Similar News

News February 13, 2026

బంగ్లాదేశ్ ఎన్నికలు.. BNP ఘనవిజయం

image

బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్‌కు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) కూటమి ఘన విజయం సాధించింది. 299 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 209 సీట్లు సొంతం చేసుకుంది. ప్రధాన పోటీదారు అనుకున్న జమాతే ఇస్లామీ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపలేదు. దీంతో ప్రధానిగా తారిఖ్ బాధ్యతలు చేపట్టనున్నారు. కొన్ని గంటల్లో అధికారికంగా ఫలితాలు వెల్లడించనున్నారు.

News February 13, 2026

ఆలస్యంగా వరి నాట్లు.. కలుపు నివారణ

image

ఆలస్యంగా వరి నాటిన పొలంలో 15-20 రోజుల సమయంలో గడ్డిజాతి కలుపు ఉన్నట్లు గుర్తిస్తే 200 లీటర్ల నీటిలో సైహలోపాప్ బ్యుటైల్ 10% ఇ.సి 400ml ద్రావణం లేదా బిస్‌ఫైరిబాక్ సోడియం 10% S.C ద్రావణం 80ML కలిపి పిచికారీ చేయాలి. అదే అంతర తామర, పిల్లడుగు, గుర్రపుడెక్క వంటి వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉంటే నాటిన 20-25 రోజుల వేళ 200 లీటర్ల నీటిలో ఎకరాకు 2,4 డి.సోడియం సాల్ట్ 80% పొడి 400 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News February 13, 2026

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా..

image

TG: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదట బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను ఒకేసారి ఓపెన్ చేస్తారు. 25 బ్యాలెట్ పత్రాల చొప్పున బండిల్ చేసి వెయ్యి ఓట్ల(ఒక రౌండ్)ను ఒక కట్టగా ఉంచుతారు. ఓట్లను బట్టి రౌండ్ల వారీగా ప్రతీ బ్యాలెట్ పేపర్‌ను ఏజెంట్‌కు చూపిస్తూ లెక్కింపు సాగుతుంది. చివరకు ఫలితాలు ప్రకటిస్తారు.
* ఫలితాలు వేగంగా తెలుసుకునేందుకు Way2Newsను ఫాలో అవ్వండి.