News September 9, 2024
వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల వివరాలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజా మిర్చి క్వింటాకు నేడు రూ.18,200 పలికింది. అలాగే 341 రకం మిర్చికి రూ.14,500 ధర రాగా వండర్ హాట్(WH) మిర్చికి రూ.15,500 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News October 11, 2024
వరంగల్: పండగ వేళ.. జాగ్రత్త!
జిల్లాలో పండగ పూట రోడ్డు ప్రమాదాలు కుటుంబీకులను కంటతడి పెట్టిస్తున్నాయి. రాయపర్తి మండలం కిష్టపురానికి చెందిన <<14329203>>అన్వేశ్(19), రాజు(24)<<>>, చెన్నారావుపేట(M) ఉప్పరపల్లికి చెందిన <<14330918>>గుల్లపల్లి అఖిల్<<>>, వాజేడు మండలం చెరుకూరుకు చెందిన <<14328812>>భూపతి<<>>.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసి కుటుంబాలను రోడ్డున పడేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
News October 11, 2024
WGL: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి
WGL,HNK, JN, BHPL, MHBD, MLG జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
News October 11, 2024
వరంగల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
వరంగల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గుల్లపల్లి అఖిల్ శుక్రవారం బైకుపై వరంగల్ నుంచి నర్సంపేట వైపు వెళ్తున్నాడు. డీసీఎం ద్విచక్రవాహనాన్ని ఢీకొనగా అఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.