News November 4, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు  

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు రూ.16,700 ధర వచ్చింది. అలాగే వండర్ హాట్ మిర్చికి రూ. 14,500 ధర పలికింది. మరోవైపు 341 రకం మిర్చి క్వింటాకు రూ.15 వేల ధర వచ్చిందని అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

Similar News

News December 7, 2024

వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్: ఎంపీ కావ్య

image

వరంగల్ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎంపీ కడియం కావ్య అన్నారు. టెక్స్‌టైల్ పార్క్ సమీపంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ కావ్య మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో నిత్యం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

News December 7, 2024

వరంగల్: రేవంత్ పాలనలో జిల్లాలో కావాల్సింది ఏంటి?

image

రేవంత్ రెడ్డి CMగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది గడిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగిలిన నాలుగేళ్లలో మామునూరు ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, టెక్స్టైల్ పార్క్ పూర్తి, పలు చోట్ల ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలు, పలు ఐటీ, ఇతర ఇండస్ట్రీస్‌ను తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు. మిగిలిన నాలుగు ఏండ్లలో ఇంకా ఏ అభివృద్ధి పనులు చేపట్టాలో కామెంట్ చేయండి.

News December 7, 2024

ములుగు: హ్యాండ్ బాల్ పోటీలకు 12మంది ఎంపిక

image

ములుగు జిల్లా హ్యాండ్ బాల్ సబ్ జూనియర్ బాయ్స్ ఎంపికలు నిర్వహించినట్లు హ్యాండ్ బాల్ ఇన్‌ఛార్జ్ కోచ్ కుమారస్వామి తెలిపారు. జిల్లా క్రీడల అధికారి తుల రవి హాజరై 40 మంది క్రీడాకారుల్లో 12 మందిని ఆల్ ఇండియా ఇంటర్ డిస్టిక్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక చేశారన్నారు. కాగా, వీరంతా జనవరి 27 నుంచి 30 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు.