News February 25, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి ఉత్పత్తులు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11,100 పలకగా, దీపిక మిర్చి రూ.17,500 ధర పలికాయి. అలాగే ఎల్లో మిర్చికి రూ.19 వేలు, టమాటా మిర్చికి రూ.31,0111, సింగిల్ పట్టి రూ.31 వేల ధర వచ్చినట్లు వ్యాపారులు చెప్పారు. గమనిక: రేపటి నుంచి మార్కెట్కు వరుసగా ఐదు రోజుల సెలవులు.
Similar News
News December 7, 2025
6వేల మందితో మూడంచెల భద్రత: సీపీ సుధీర్ బాబు

TG: గ్లోబల్ సమ్మిట్కు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ‘6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత, వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 2 రోజుల తర్వాత పబ్లిక్కు అనుమతి ఉంటుంది. డెలిగేట్స్కు పైలట్ వాహనాలను ఏర్పాటు చేశాం. సమ్మిట్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి’ అని పేర్కొన్నారు.
News December 7, 2025
BREAKING.. హైకోర్టు సీరియస్.. పెద్దంపేట GP ఎన్నిక నిలిపివేత

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్ అభ్యర్థి చింతపట్ల సుహాసిని నామినేషన్ను ఓటర్ లిస్టులో పేరు లేదని ఈసీ తిరస్కరించింది. ఆన్లైన్ ఓటర్ లిస్టులో పేరు ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పోటీకి అవకాశం ఇవ్వకపోవడంతో హైకోర్టు ఆగ్రహించింది. హైకోర్టు ఆదేశించినా అధికారులు వినకపోవడంతో ఎన్నికను నిలిపివేసింది.
News December 7, 2025
తల్లయిన హీరోయిన్ సోనారిక

టాలీవుడ్ హీరోయిన్ సోనారిక తల్లి అయ్యారు. ఈ నెల 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇవాళ ఆమె ఇన్స్టాలో వెల్లడించారు. ‘దేవోం కే దేవ్ మహాదేవ్’ సీరియల్లో పార్వతీదేవిగా నటించిన ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో హీరోయిన్గా నటించారు. గత ఏడాది వ్యాపారవేత్త వికాస్ పరాశర్ను వివాహం చేసుకున్నారు.


