News March 13, 2025

వరంగల్ మార్కెట్లో మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా.!

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అరుదైన మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.16,500 పలకగా, 5531 రకం మిర్చికి రూ. 11,000 ధర వచ్చింది. అలాగే 1048 మిర్చికి రూ.11 వేలు, టమాటా మిర్చికి రూ.32వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.37000 ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.

Similar News

News March 22, 2025

బెట్టింగ్ రాయుళ్లపై నజర్ పెట్టండి: వరంగల్ సీపీ

image

నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమవుతున్న వేళ క్రికెట్ బెట్టింగ్‌లకు అవకాశం ఉండటంతో WGL CP సన్ ప్రీత్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో బెట్టింగ్ రాయుళ్లపై నిఘా పెట్టాలని, యువత బెట్టింగ్‌పై ఆసక్తి చూపకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గతంలో బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై నిఘా పెట్టాలని, ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News March 22, 2025

వరంగల్ జిల్లాలో తగ్గుతున్న భూగర్భ జలాలు

image

వరంగల్ జిల్లాలో వేసవి దృష్ట్యా భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. గతేడాది ఫిబ్రవరి కంటే ఈ ఏడాది మరింత లోతుకు పడిపోయాయి. జిల్లాలో దుగ్గొండి, ఖానాపురం, ఖిలా వరంగల్ మినహా మిగతా 10 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపు చేసుకునేందుకు ఇళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలను తవ్వడం, నీటి వృథాను అరికట్టడం వంటి చర్యలు ఉత్తమ మార్గం.

News March 22, 2025

తొర్రూర్‌లో బాలికకు అబార్షన్!

image

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మైనర్ బాలికకు గర్భస్రావం చేసిన ఘటన తొర్రూరులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాలు.. దంతాలపల్లి మం.కి చెందిన ఓ బాలిక గర్భం దాల్చడంతో ఆస్పత్రికి తీసుకురాగా అబార్షన్ చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న చైల్డ్ లైన్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితుడిపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

error: Content is protected !!