News June 11, 2024

వరంగల్: మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో నేడు మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.18,500 ధర పలికింది. అలాగే 341 రకం మిర్చికి సైతం నిన్నటి (రూ.16,500) ధర వచ్చింది. వండర్ హాట్ (WH) రకం మిర్చికి సోమవారం రూ.18,000 ధర రాగా నేడు రూ.18,500 ధర వచ్చింది. కాగా, నేడు మార్కెట్‌కు మిర్చి తరలివచ్చింది.

Similar News

News March 19, 2025

వరంగల్: సెల్ ఫోన్ కాంతులతో దహన సంస్కారాలు!

image

సెల్‌ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు చేసిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరిలో జరిగింది. స్థానికుల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణించాడు. సమయం దాదాపు రాత్రి 7 కావడంతో సెల్‌ఫోన్ వెలుగుల్లో దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో అక్కడ ఎలాంటి విద్యుత్ ఏర్పాట్లు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో స్నానాలు చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యులెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

News March 19, 2025

వేగవంతంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన: కలెక్టర్

image

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు 41,412 దరఖాస్తులు రాగా.. 14,899 క్రమబద్దీకరణకు మంజూరు చేశారు. ఫీజు చెల్లించిన 665 మందికి క్రమబద్ధీకరణ పత్రాలు అందజేయడం జరిగిందన్నారు.

News March 19, 2025

పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో వరంగల్ కలెక్టర్ సమీక్ష

image

సీఈవో ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయంలో అదరపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా ఎలక్ట్రోరల్ డ్రాఫ్ట్ మొత్తం ఓటర్లు 771139 కాగా, అందులో ఆడిషన్స్ 3777, డెలిషన్స్ 2092 ఉన్నాయని ఫైనల్ ఎలక్ట్రానిక్ ఓటర్లు 772824 ఉన్నారన్నారు.

error: Content is protected !!