News July 10, 2024

వరంగల్ మార్కెట్‌లో వివిధ ఉత్పత్తుల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు పల్లికాయ, పసుపు తరలివచ్చాయి. ఈ క్రమంలో క్వింటా పసుపు ధర రూ.12,501 పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.6110 పలకగా.. పచ్చి పల్లికాయ ధర రూ.4300 పలికింది. మరోవైపు మక్కలు రూ. 2620, 5531 మిర్చి 13వేల ధర పలికాయి. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులు తగుజాగ్రత్తలు పాటిస్తూ సరుకులు మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News November 27, 2025

Te-Poll యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: వరంగల్ కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పూర్తి సమాచారాన్ని వేగంగా, సులభంగా అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్‌ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్ నమోదు స్థితి వంటి కీలక సమాచారాన్ని ఒకే యాప్ ద్వారా తెలుసుకునే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యాప్ ఇది అని పేర్కొన్నారు.

News November 27, 2025

వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ సమీక్ష

image

వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను మరింత పటిష్ఠంగా సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్, జిల్లా పరిశీలకురాలు బి.బాల మాయదేవి (IAS) వరంగల్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమొక్క అందించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కలెక్టరేట్ ఛాంబర్‌లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.