News October 7, 2024

వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

2 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ఈరోజు ప్రారంభమైంది. గత వారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. గత వారంలో క్వింటా పత్తి రూ.7,450 పలకగా నేడు రూ.7550 అయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆశించిన స్థాయిలో ధర రాకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.

Similar News

News November 3, 2024

నేడు మడికొండకు సీఎం రేవంత్ రెడ్డి రాక

image

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మడికొండకు రానున్నారు. ఉదయం 10:15 నిమిషాలకు హనుమకొండకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారని అధికారులు తెలిపారు. అనంతరం మడికొండలో ఓ గార్డెన్‌లో ఉ.10.25 నిమిషాలకు జంగా రాఘవరెడ్డి కూతురు వివాహానికి హాజరవుతారని అన్నారు. అనంతరం 11:45 నిమిషాలకు హైదరాబాద్‌కు చేరుకుంటారని తెలిపారు.

News November 2, 2024

WGL: నేటి నుంచి ‘సామూహిక కార్తీకమాస దీపోత్సవ వేడుకలు’

image

కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరివేసేలా దేవాదాయ శాఖ నేటి నుంచి ‘సామూహిక కార్తీకమాస దీపోత్సవ వేడుకలు’ వైభవోపేతంగా నిర్వహిస్తున్నదని మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. 2నవంబర్ 2024 నుంచి 1 డిసెంబర్ 2024 వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని దేవాలయాల్లో కార్తీకమాస దీపోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించేలా కార్య నిర్వహణాధికారులు, అసిస్టెంట్ కమిషనర్లకు మంత్రి ఆదేశించారు.

News November 2, 2024

సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క

image

MLG’ సచివాలయంలో DRDOలతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వచ్చే అయిదు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలను చేశారు. మహిళలకు ఉపాధి భరోసా, పంట పొలాలకు బాటలు, పండ్ల తోటల పెంపకం, గ్రామాల మౌలిక వసతుల కల్పన, స్వచ్చ భారత్ మిషన్ కోసం ఉపాధి నిధులు వినియోగించాలని సీతక్క మార్గదర్శనం చేశారు.