News October 16, 2024
వరంగల్ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తిధర పెరిగింది. మంగళవారం క్వింటా కొత్తపత్తి ధర రూ.6,900 ధర పలకగా.. నేడు రూ.7,060కి పెరిగింది. అలాగే పాత పత్తికి నిన్న రూ.7,400 ధర రాగా.. నేడు రూ.7,450 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్ను బట్టి మార్కెట్ ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.
Similar News
News October 22, 2025
హనుమకొండలో ధాన్యం అక్రమాలు

HNK జిల్లా శాయంపేట, కాట్రపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకున్నారు. వీవోఏ బలభద్ర హైమావతి, అల్లె అనితలు మిల్లర్తో కలసి కోట్లలో అక్రమాలకు పాల్పడ్డట్లు బయటపడ్డాయి. ఈ కేసులో 21 మందిపై శాయంపేట స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. వీవోఏలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శాఖా చర్యలతో విధుల నుంచి తొలగించి, సీసీలకు నోటీసులు ఇచ్చారు.
News October 22, 2025
వరంగల్లో నకిలీ ఏసీబీ మోసం

గుర్తు తెలియని వ్యక్తులు ఏసీబీ అధికారులమని చెప్పి ఆర్టీఏ ఎంవీఐల నుంచి దశల వారీగా రూ.10.20 లక్షలు కాజేశారు. ఫోన్లలో నకిలీ బెదిరింపులు చేయడంతో ఓ ఎంవీఐకు అనుమానం రావడంతో వెంటనే WGL ఏసీబీ డీఎస్సీ సాంబయ్యను ఆశ్రయించారు. దీంతో నిజం తెలిసింది. ఆర్టీఏ అధికారులు మోసపోయిన వివరాలు గుట్టుగా ఉంచాలని ప్రయత్నించగా, స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను వెతికే పనిలో పడ్డారు.
News October 22, 2025
వరంగల్: ప్లాస్టిక్ సంచుల్లో పత్తి నిల్వ చేయొద్దు

పంట చేలలో పత్తి ఏరిన రైతులు ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేసి అనంతరం కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారని, ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేయడం ద్వారా సంచుల దారాలు పత్తిలో ఇరుక్కుపోయి నాణ్యత తగ్గిపోతుందని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. పత్తి ఏరిన సమయంలో బట్ట సంచులు లేదా చీరల్లో పత్తిని నిల్వ చేయాలని సూచించారు. సంచిలో పత్తి ఎక్కువ పట్టాలని కుక్కి తీసుకు వస్తారని, అలా కూడా చేయకూడదన్నారు.