News November 5, 2024
వరంగల్ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం తేజ మిర్చి క్వింటాకు రూ.16,700 ధర రాగా నేడు రూ. 16,800 ధర వచ్చింది. అలాగే వండర్ హాట్ మిర్చికి నిన్న రూ. 14,500 ధర రాగా, ఈరోజు రూ.15వేల ధర పలికింది. మరోవైపు 341 రకం మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.15 వేల ధర వచ్చిందని అధికారులు తెలిపారు.
Similar News
News January 10, 2026
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల హౌసింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాల కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేయాలని వరంగల్ కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. జడ్పీ సీఈవో, ఇన్ ఛార్జ్ డీఆర్డీఓ రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News January 9, 2026
వరంగల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. వంట సిబ్బంది తొలగింపు

వరంగల్ జిల్లా సంగెంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ డా.సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట చేసే సిబ్బంది విద్యార్థినులతో అమర్యాదగా ప్రవర్తించడం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి, ముగ్గురు వంట సిబ్బందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News January 9, 2026
వరంగల్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా

వరంగల్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ జాబ్ మేళా 13-01-2026న ఐటిఐ క్యాంపస్‌లో నిర్వహించనున్నారు.
ఈ మేళాలో IndusInd Nippon Life Insurance Co. LTD, శ్రీ సాయి అగ్రి టెక్నాలజీస్ సంస్థలు పాల్గొననున్నాయి. IndusInd Nippon Life Insurance సంస్థలో లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులకు 25 ఖాళీలు ఉన్నాయన్నారు.


