News August 7, 2024

వరంగల్ మార్కెట్ చిరు ధాన్యాల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌‌‌లో బుధవారం వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా సూక పల్లికాయ రూ.6,590, పచ్చి పల్లికాయకు రూ.4,750 ధర వచ్చింది. పసుపు క్వింటా రూ.13,859 ధర, 5531 రకం మిర్చి రూ.11,500 ధర పలికిందని వ్యాపారులు తెలిపారు. మరోవైపు మక్కలు క్వింటాకి రూ. రూ.2,715 పలికాయి. అయితే నిన్నటితో పోలిస్తే నేడు అన్ని రకాల సరకుల ధరలు పెరిగాయి.

Similar News

News September 17, 2024

హనుమకొండ: జాతీయ జెండా ఎగురవేయనున్న కొండా సురేఖ

image

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా మంగళవారం హాజరవుతున్నారు. నేడు ఉదయం 9:48 నిమిషాలకు అదాలత్ కూడలిలోని అమరవీరుల స్తూపానికి పూలతో అంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 10 గంటలకు హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకొని జాతీయ జెండా ఎగరవేస్తారు.

News September 17, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> MLG: వితంతు మహిళపై అత్యాచారం… బాధిత కుటుంబం నిరసన
> JN: నిమజ్జనంలో అపశ్రుతి..
> HNK: గంజాయి తరలిస్తుండగా.. అరెస్టు
> JN: సీత్యా తండాలో పీడీఎస్ బియ్యం పట్టివేత..
> MLG: ఆదివాసీ విద్యార్ధి సంఘం మాజీ అధ్యక్షుడు మృతి..
> MHBD: బ్రెయిన్ ట్యూమర్ తో యువతి మృతి..
> JN: డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన సదస్సు..

News September 16, 2024

ఖిల్లా వరంగల్ కోటకు మంత్రి పొంగులేటి

image

ఖిల్లా వరంగల్ కోటలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, వరంగల్ విద్యుత్ ఎస్ఈ మధుసూదన్ రావు, తాహశీల్దార్లు నాగేశ్వరరావు, ఇక్బాల్ పాల్గొన్నారు.