News November 4, 2024
వరంగల్ మార్కెట్ నేడు పున:ప్రారంభం

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పునఃప్రారంభం కానుంది. వరుసగా 4 రోజుల సెలవులు (గురువారం దీపావళి, శుక్రవారం అమావాస్య, శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో) మార్కెట్ బంద్ అయింది. దీంతో సోమవారం నుంచి మార్కెట్ పున:ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఉ.6 గం.ల నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు.
Similar News
News November 15, 2025
మహబూబాబాద్: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు. MHBD పట్టణం కంకర బోర్డులోని జడ్పీ హై స్కూల్లో సోషల్ టీచర్‌గా పని చేస్తున్న రవి 10 రోజులుగా ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తల్లితో చెప్పింది. ఆమె ఫిర్యాదుతో టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.
News November 14, 2025
వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక కంట్రోల్ రూమ్

వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వరంగల్ కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ప్రారంభించినట్లు కలెక్టర్ సత్య శారద ప్రకటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల వరకు జరిగే మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ కంట్రోల్ రూమ్ ముఖ్యపాత్ర పోషిస్తుందని వివరించారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ 1800 425 3424ని సంప్రదించాలన్నారు.
News November 12, 2025
వరంగల్: ఉపాధ్యాయుల హాజరుపై FRS నిఘా..!

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల డుమ్మాకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) యాప్ ద్వారా ఉపాధ్యాయుల హాజరుపై నిఘా పెట్టనుంది. హాజరు ఇన్, ఔట్ టైమ్‌లను యాప్‌లో నమోదు చేయకపోతే చర్యలు తప్పవు. సెలవు, ట్రైనింగ్, కార్యాలయ పనులకైనా యాప్ ద్వారా అనుమతి తప్పనిసరి. వరంగల్ జిల్లాలో 325 ప్రాథమిక, 121 ఉన్నత పాఠశాలల్లో ఈ యాప్ అమలు మొదలైంది.


