News November 11, 2024
వరంగల్ మార్కెట్ నేడు పునఃప్రారంభం
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునఃప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
Similar News
News December 10, 2024
వరంగల్: విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా మంత్రులు
డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. సెక్రటేరియట్‌లో నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరయ్యారు.
News December 9, 2024
సిద్దేశ్వరస్వామి వారికి ప్రత్యేక అలంకరణ
హన్మకొండలోని స్వయం భూ లింగం శ్రీ సిద్దేశ్వరస్వామి దేవాలయంలో మార్గశిర మాసం సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో అలంకరించి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సురేశ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
News December 9, 2024
ములుగు: నేడు మావోయిస్టుల బంద్.. టెన్షన్.. టెన్షన్
నేడు మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ములుగు జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏటూరునాగారం ఏజెన్సీలో పోలీసులు ఆదివాసీ గూడాలు, అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఎస్ఔ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పలు లాడ్జీల్లో తనిఖీలు చేపట్టారు. ఎవరైన గుర్తు తెలియని వ్యక్తులు లాడ్జీల్లో ఉన్నారా..? అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెంచారు.