News October 20, 2024
వరంగల్ మార్కెట్ రేపు తిరిగి ప్రారంభం
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం తిరిగి ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
Similar News
News November 9, 2024
వరంగల్ మార్కెట్ నేడు, రేపు బంద్
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు, రేపు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేడు వారాంతపు యార్డు బంద్, రేపు (ఆదివారం) సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కు సరుకు తీసుకుని రావద్దని సూచించారు.
News November 9, 2024
WGL: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..
కులగణన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
News November 9, 2024
నేడు కేయూ పరిధిలోని కళాశాలలకు వర్కింగ్ డే: రిజిస్ట్రార్
కాకతీయ విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మ సందర్భంగా సెలవు ప్రకటించినందున నేడు రెండో శనివారం వర్కింగ్ డే అని రిజిస్ట్రార్ మల్లారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కావున కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలలు, విభాగాలు పని చేయాలని, విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని ఆదేశించారు.