News March 16, 2025

వరంగల్ మార్కెట్ రేపు పునః ప్రారంభం

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునః ప్రారంభం కానుంది. శుక్రవారం హోలీ సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

Similar News

News November 3, 2025

శభాష్.. షెఫాలీ!

image

వైల్డ్ కార్డ్‌ ఎంట్రీతో తన వైల్డ్ పర్ఫామెన్స్‌తో టీమిండియా కప్పు కొట్టడంలో కీలకపాత్ర పోషించిన షెఫాలీ వర్మ క్రికెట్ జర్నీ అంత సాఫీగా సాగలేదు. క్రికెట్ అకాడమీలో చేరేటప్పుడు అమ్మాయి అని తనను ఎవరూ చేర్చుకోలేదు. దీంతో జుట్టు కత్తిరించుకొని అబ్బాయిలా మారి వాళ్లతో ఆడారు. అందుకోసం రోజూ 16KM సైకిల్‌పై వెళ్లేవారు. తన ప్రతిభతో జట్టులో చోటు సంపాదించి, జట్టుకు తొలి WC ట్రోఫీ అందించిన ఆమె జర్నీ స్ఫూర్తిదాయకం.

News November 3, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 03, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.15 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.