News January 3, 2025

వరంగల్ మార్కేట్లో పెరిగిన పల్లికాయ ధర

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు పల్లికాయ తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకు గురువారం రూ.7,200 ధర పలకగా.. నేడు రూ.7,300 పలికింది. అలాగే పచ్చి పల్లికాయ రూ.4,680 ధర పలకగా నేడు రూ.4,700 పలికింది. అలాగే 5531 రకం మిర్చి క్వింటాకు రూ.12,500, అగ్ని మిర్చి ధర రూ.14వేలు పలికింది.

Similar News

News November 8, 2025

పంట నష్టాన్ని పారదర్శకంగా నమోదు చేయాలి: వరంగల్ కలెక్టర్

image

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా వర్ధన్నపేట మండల కేంద్రంలో ఇటీవల దెబ్బతిన్న పంటలను కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల నష్టాన్ని పూర్తిగా పారదర్శకంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, DM సివిల్ సప్లైస్ సంధ్యారాణి తదితరులు ఉన్నారు.

News November 7, 2025

వర్ధన్నపేట: వడ్లు ఆరబెట్టే యంత్రాలను రైతులు వినియోగించుకోవాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన డ్రై హెడ్ మిషన్ (వడ్లు అరబెట్టే యంత్రం)లను రైతులు వినియోగించుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి సూచించారు. వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్‌ను శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. యంత్రాల ద్వారా వడ్లను ఎలా ఆరబెట్టుకోవాలో రైతులకు అవగాహన కల్పించి, ఆధునిక పద్ధతులపై సూచనలు చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరకుడు వెంకటయ్య, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.

News November 7, 2025

వరంగల్: నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులతో ఆర్బిట్రేషన్

image

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి దిశగా రూపుదిద్దుకుంటున్న 163-జి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ డా.సత్య శారద శుక్రవారం ఆర్బిట్రేషన్ నిర్వహించారు. వర్ధన్నపేట మండలంలోని ఉకల్, బొడ్డు చింతలపల్లి గ్రామాల రైతులతో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి పాల్గొన్నారు.