News February 26, 2025
వరంగల్: ముమ్మరంగా తెర వెనుక ప్రచారం..!

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బయటకు పెద్దగా కనిపించలేదు. కానీ విద్యా సంస్థలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. ప్రధానంగా విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న HNK, WGLతో పాటు NSPT, JN, MHBD, BHPL పట్టణాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఉమ్మడి జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉన్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సామ దాన భేద దండోపాయాలను అమలు చేస్తున్నారు.
Similar News
News October 19, 2025
దీపావళి: దీపారాధనకు పాత ప్రమిదలను వాడొచ్చా?

పాత(లేదా) గతేడాది వాడిన మట్టి ప్రమిదలను ఈసారి కూడా వెలిగించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ‘ప్రమిదలు దైవిక శక్తులతో పాటు ప్రతికూల శక్తులను కూడా గ్రహిస్తాయి. వాటిని తిరిగి వాడితే అది మన అదృష్టాన్ని, సంపదను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీపావళి రోజున కొత్త ప్రమిదలను వాడటమే శ్రేయస్కరం. పాత ప్రమిదలను తులసి కోటళ్లో, గౌరవంగా పవిత్ర నదుల్లో, పవిత్ర చెట్ల మొదళ్లలో ఉంచడం మంచిది.
News October 19, 2025
విశాఖ-బెంగళూరు మధ్య స్పెషల్ రైలు

దీపావళి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైలును నడపనుంది. అక్టోబర్ 21న ఉదయం 8.20కు విశాఖపట్నం నుంచి బెంగళూరు ఎస్ఎమ్వీటీకి వన్వే స్పెషల్ రైలు (సంఖ్య 08545) బయలుదేరి, అక్టోబర్ 22న ఉదయం 6.45కు చేరుతుంది. దువ్వాడ, అనకాపల్లి,యలమంచిలి, సామర్లకోట రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.
News October 19, 2025
వీధి వ్యాపారులతో ముచ్చటించిన సీఎం

AP: సీఎం చంద్రబాబు విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ 2.0తో ధరల తగ్గింపు గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. వ్యాపారుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు యజమానులు, సామాన్య ప్రజలతో ముచ్చటించారు.