News August 16, 2024

వరంగల్: మూడో విడత.. 56,704 మంది రైతులకు రుణమాఫీ

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత రుణమాఫీ రూ.2 లక్షల వరకు ప్రకటించింది. గురువారం మూడో విడత రుణమాఫీ ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 56,704 మంది రైతులకు లబ్ధి చేకూరింది. వీరికి సంబంధించి రూ.735.29 కోట్ల రుణం మాఫీ కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం నుంచి ఖాతాలో డబ్బులు జమ కానున్నాయని అధికారులు తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 15, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> MHBD: రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు
> MLG: మద్యం మత్తులో ఇద్దరు యువకుల వీరంగం
> WGL: గంజాయిని పట్టుకున్న పోలీసులు
> MHBD: గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరి అరెస్ట్
> BHPL: నిజాంపల్లిలో కరెంట్ షాక్‌తో యువకుడు మృతి
> HNK: ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
> HNK: రీల్స్ చేస్తూ హై-టెన్షన్ వైరు తాకి గాయాల పాలైన యువకుడు

News September 14, 2024

HNK: రీల్స్ చేస్తూ హై టెన్షన్ వైరు తాకి గాయాల పాలైన యువకుడు

image

రైలు పైకి ఎక్కి రీల్స్ చేస్తుండగా హైటెన్షన్ వైర్లు తాకి వ్యక్తి గాయాలపాలైన ఘటన కాజీపేటలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. రాజ్ కుమార్ అనే వ్యక్తి కడిపికొండ దగ్గరలో గల రాంనగర్ సమీప రైల్వే ట్రాక్‌పై ఆగిఉన్న గూడ్స్ రైలుపైకి సెల్ఫీలు దిగుతూ రీల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో హై టెన్షన్ కరెంట్ వైర్లు తాకడంతో 70% శరీరం కాలిపోయింది. గమనించిన స్థానికులు ఎంజీఎంకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2024

ఈనెల 16 నుంచి 17 వరకు వైన్స్ బంద్: వరంగల్ సీపీ

image

ఈనెల 16న గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 16 నుంచి 17 వరకు మద్యం విక్రయాలను నిలిపివేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం తెలిపారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కారించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా వైన్స్‌లను బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.