News December 20, 2024
వరంగల్: మొక్కజొన్న క్వింటా రూ.2,510
వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు నేడు మొక్కజొన్న తరలివచ్చింది. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు మొక్కజొన్న ధర స్వల్పంగా పెరిగింది. గురువారం మార్కెట్లో క్వింటా మక్కలు (బిల్టీ) ధర రూ.2,500 పలకగా నేడు రూ.2510 పలికింది. అలాగే కొత్త తేజ మిర్చి సైతం మార్కెట్‌కి తరలిరాగా ఉన్నట్టు పోలిస్తే ధర భారీగా తగ్గింది. గురువారం కొత్త తేజ మిర్చి క్వింటాకు రూ.16,100 పలకగా నేడు రూ.15,500 పలికినట్లు రైతులు తెలిపారు.
Similar News
News January 16, 2025
రెండు జాతరల్లో మెరుగైన వైద్య సేవలు: DMHO
హనుమకొండ జిల్లాలో జరుగుతున్న రెండు (ఐనవోలు, కొత్తకొండ) జాతరల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు DMHO డా.అల్లం అప్పయ్య తెలిపారు. ఐనవోలులో 50 మంది, కొత్తకొండలో 40 మంది వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, స్టాఫ్ నర్సులు, హెల్త్ అసిస్టెంట్లు ANMలు, MNOలు ఆశాలు 3 షిఫ్టులలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కొత్తకొండ జాతరలో 1,071, ఐనవోలులో 3,728 మందికి సేవలందించామన్నారు.
News January 15, 2025
రేపు వరంగల్ మార్కెట్ పునఃప్రారంభం
ఐదు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం పున: ప్రారంభం కానుంది. శని, ఆదివారం వారాంతపు యార్డు బంద్, సోమ, మంగళ, బుధవారం సంక్రాంతి సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. ఉ. 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News January 15, 2025
గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించిన మంత్రి కొండా
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా సమర్థవంతంగా కార్యాచరణను అమలు చేయాలని మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఈరోజు ఉదయం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లతో ఢిల్లీ నుంచి గూగుల్ మీట్ ద్వారా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 26 నుంచి అమలు చేయనున్న నూతన పథకాలను నిబద్ధతతో అమలు చేసి, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని మంత్రి సూచించారు.