News February 3, 2025

వరంగల్: యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం

image

యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సుబేదారి PS పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం(M) ఓ గ్రామానికి చెందిన యువతి ఇంట్లో గొడవపడి HNKలోని స్నేహితురాలి వద్ద ఉంటోంది. బాలసముద్రంలో ఎగ్జిబిషన్‌‌ నుంచి తిరుగు ప్రయాణంలో ఆటోడ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బస్టాండ్‌లో వదిలేశాడు. స్థానికులు యువతిని PSకి తరలించగా ఆటోడ్రైవర్ అత్యాచారం చేసినట్లు తెలిపింది.

Similar News

News March 6, 2026

ములుగు జిల్లా యువకుడికి సివిల్స్ ర్యాంక్

image

కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమేనని ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ నిరూపించారు. ఇటీవల గ్రూప్-1 పరీక్షల్లో 105వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికైన ఆయన, నేడు విడుదలైన UPSC సివిల్స్ ఫలితాల్లో 793వ ర్యాంక్ సాధించారు. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవీణ్‌ను పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఆయన నానమ్మ పెంచారు. ప్రవీణ్ విజయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 6, 2026

జిల్లాలో 305 మంది ఇంటర్ విద్యార్థుల గైర్హాజరు

image

కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఐఈఓ ఆఫీస్ నుంచి వివిధ కళాశాలల్లో జరుగుతున్న పరీక్షలను సీసీ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆయన పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా 42 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 7265 మంది విద్యార్థులకు గానూ 6960 మంది హాజరు కాగా, 305 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.

News March 6, 2026

కదిరిలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళల అరెస్ట్

image

కదిరి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివ నారాయణస్వామి శుక్రవారం తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.5,65,000 విలువ చేసే నగలు, రూ.75,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.