News February 3, 2025

వరంగల్: యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం

image

యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సుబేదారి PS పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం(M) ఓ గ్రామానికి చెందిన యువతి ఇంట్లో గొడవపడి HNKలోని స్నేహితురాలి వద్ద ఉంటోంది. బాలసముద్రంలో ఎగ్జిబిషన్‌‌ నుంచి తిరుగు ప్రయాణంలో ఆటోడ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బస్టాండ్‌లో వదిలేశాడు. స్థానికులు యువతిని PSకి తరలించగా ఆటోడ్రైవర్ అత్యాచారం చేసినట్లు తెలిపింది.

Similar News

News January 11, 2026

తప్పు ఒప్పుకొన్న X.. అశ్లీల పోస్టుల తొలగింపు

image

కేంద్ర ప్రభుత్వం హెచ్చరికతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X దిగొచ్చింది. గ్రోక్‌లో అశ్లీల కంటెంట్‌పై గతవారం <<18795355>>IT శాఖ సీరియస్<<>> అవ్వడంతో X యాజమాన్యం స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాట్‌ఫామ్‌లో ఉన్న 3,500 అశ్లీల పోస్టులను బ్లాక్ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన 600 అకౌంట్లను పూర్తిగా తొలగించింది. తమ మోడరేషన్‌లో లోపాలున్నాయని అంగీకరించింది. భారత చట్టాలకు లోబడి పనిచేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.

News January 11, 2026

కోనసీమ: ఓడలరేవు తీరంలో ప్రమాదం

image

అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో కోత నివారణకు ONGC ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రక్షణ కవచం పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద రాళ్లను అన్‌లోడ్ చేస్తున్న సమయంలో ఒక లారీ అదుపుతప్పి ఒక్కసారిగా తిరగబడింది. తీర ప్రాంతంలో పనులు వేగంగా జరుగుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 11, 2026

పిండి వంటల్లో బెల్లం వాడుతున్నారా?

image

సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా పిండి వంటల ఘుమఘుమలే. అయితే తీపి వంటకాల్లో పంచదారకు బదులు బెల్లం వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం, జింక్, సెలీనియం, విటమిన్లు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి. శరీరంలో చేరిన మలినాలను బయటకు పంపేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.