News February 3, 2025
వరంగల్: యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం

యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సుబేదారి PS పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం(M) ఓ గ్రామానికి చెందిన యువతి ఇంట్లో గొడవపడి HNKలోని స్నేహితురాలి వద్ద ఉంటోంది. బాలసముద్రంలో ఎగ్జిబిషన్ నుంచి తిరుగు ప్రయాణంలో ఆటోడ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బస్టాండ్‌లో వదిలేశాడు. స్థానికులు యువతిని PSకి తరలించగా ఆటోడ్రైవర్ అత్యాచారం చేసినట్లు తెలిపింది.
Similar News
News January 14, 2026
నేడు ఐనవోలుకు మంత్రి కొండా సురేఖ

హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం ఉదయం 10:30 గంటలకు మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రానున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాల్లో వారు పాల్గొననున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు.
News January 14, 2026
పండుగల్లో ఇలా రెడీ..

పండుగల్లో మహిళలకు పని, పూజ, ఇంటి అలంకరణ ఇలా బోలెడుంటాయి. చివరికి అన్నీ పూర్తి చేసుకొనే సమయానికి రెడీ అయ్యే టైం ఉండదు. అందుకే పండుగరోజు వేసుకొనే దుస్తులు, గాజులు, పిన్నులు అన్నీ పక్కన పెట్టుకోండి. సులువుగా ఉండే హెయిర్ స్టైల్ వేసుకోండి. తక్కువ మేకప్‌కి ప్రాధాన్యమివ్వండి. కాస్త పెద్దబొట్టు పెడితే సంప్రదాయ వస్త్రాలకు నప్పుతుంది. అన్నీ సర్దుకున్నాకే చీరకట్టుకుంటే కంగారుగా అటూ ఇటూ తిరగాల్సిన పనుండదు.
News January 14, 2026
సిప్‌లో ఏటా పెరుగుతున్న పెట్టుబడులు!

సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లో ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2025లో మదుపరులు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో రూ.3.34 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. సురక్షిత పెట్టుబడి, ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాలిక సంపద సృష్టిగా ఇన్వెస్టర్లు భావించడమే దీనికి కారణమని తెలుస్తోంది. కాగా 2023లో రూ.1.84 లక్షల కోట్లు, 2024లో రూ.2.68 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.


