News February 3, 2025
వరంగల్: యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం

యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సుబేదారి PS పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం(M) ఓ గ్రామానికి చెందిన యువతి ఇంట్లో గొడవపడి HNKలోని స్నేహితురాలి వద్ద ఉంటోంది. బాలసముద్రంలో ఎగ్జిబిషన్ నుంచి తిరుగు ప్రయాణంలో ఆటోడ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బస్టాండ్లో వదిలేశాడు. స్థానికులు యువతిని PSకి తరలించగా ఆటోడ్రైవర్ అత్యాచారం చేసినట్లు తెలిపింది.
Similar News
News October 16, 2025
మాదకద్రవ్యాల నియంత్రణపై కఠిన చర్యలు: వేణు

పెద్దపల్లి జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం అవసరమని అన్నారు. విద్యాసంస్థలు, హాస్టళ్లలో విద్యార్థుల అలవాట్లపై పర్యవేక్షణ ఉండాలన్నారు. గంజాయి సాగును అరికట్టేందుకు అటవీ శాఖతో పాటు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
News October 16, 2025
పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన వాయిదా.!

పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన వాయిదా పడింది. ఈ నెల 16న మోదీ కర్నూలు పర్యటన, దాంతో పాటు వాడపల్లి బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో పోలీసు బలగాలు ఆ కార్యక్రమాలకు వెళ్లనున్నాయి. ఈ మేరకు దీపావళి అనంతరం రాజోలుకు పవన్ రానున్నట్లు MLA దేవ వరప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా కేశనపల్లి తీరంలో తోటల పరిశీలన, పల్లెపండుగలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
News October 16, 2025
ఐక్యరాజ్య సమితి అధికారులతో పెద్దపల్లి MP భేటీ

PDPL MP వంశీ కృష్ణ గడ్డం ఐక్యరాజ్య సమితి, ACABQ ఛైర్పర్సన్ జూలియానా గాస్పర్ రుయాస్, UN ఆర్థిక, బడ్జెట్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ చంద్రమౌళి రామనాథన్ను బుధవారం న్యూయార్క్లో కలిశారు. ఈ సమావేశంలో UN ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా శాంతి భద్రతా నిధులపై చర్చ జరిగింది. ప్రపంచ శాంతి పరిరక్షణలో భారత్ కీలక పాత్రను మన దేశ ప్రతినిధులు పునరుద్ఘాటించారు. పారదర్శకత, బాధ్యత, సమర్థతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.