News March 26, 2024
వరంగల్: యువతి ఫోన్ నుంచి మెసేజ్.. యువకుడిపై దాడి
నర్సంపేటకు చెందిన ఓ యువతి, తొర్రూరు మండలం చర్లపాలెం వాసి ప్రకాశ్ ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఒప్పుకోని యువతి తండ్రి శ్రీనివాస్.. 5నెలల క్రితం పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించగా ఆ ఇద్దరు దూరంగా ఉంటున్నారు. కుమార్తెపై అనుమానంతో ఈనెల 24న ఆమె ఫోన్ నుంచి ఇంటికి రావాలని ప్రకాశ్‌కు శ్రీనివాస్ మెసేజ్ చేశాడు. అది నమ్మి ఇంటికి వచ్చిన ప్రకాశ్‌పై దాడి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.
Similar News
News January 10, 2025
కొడకండ్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం జర్నీ తండా వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. డీసీఎం, తుఫాన్ వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మృతులు సూర్యాపేట జిల్లా ఈటూరు గ్రామానికి చెందిన పేరాల జ్యోతి, పేరాల వెంకన్నగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 10, 2025
WGL: ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ప్రారంభమైన ఏకాదశి వేడుకలు
వైకుంఠ ఏకాదశి వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏకాదశి రోజున విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల గట్టి నమ్మకం. కాగా మహావిష్ణువును దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి బయలుదేరే రోజే వైకుంఠ ఏకాదశిగా చెప్పుకుంటారు. పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
News January 10, 2025
హనుమకొండ: ఉరేసుకుని ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్
ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని హౌజ్‌బుజుర్గ్ గ్రామానికి చెందిన కమలాకర్(37) పరకాల డివిజన్‌లోని మిషన్ భగీరథలో పని చేస్తున్నారు. కాగా, ఇతడికి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరడం లేదు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కమలాకర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.