News February 4, 2025
వరంగల్: రథ సప్తమి.. ఆలయాల్లో పోలీస్ బందోబస్తు

రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగర పరిధిలోని ప్రధాన ఆలయాలతో పాటు వెంకటేశ్వస్వామి ఆలయాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ అంబర్ కిశోర్ ఝా పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా భక్తుల తాకిడి అధికంగా ఉండే ఆలయాల్లో మహిళా పోలీస్ సిబ్బందితో పాటు సీసీఎస్, షీ టీం పోలీసులు పరిసరాల్లో ముమ్మర పెట్రోలింగ్ చేపట్టాలని, ఆలయ ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై దృష్టి సారించాలని సూచించారు.
Similar News
News February 19, 2025
WGL: ‘స్మార్ట్ సిటీ పనులను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలి’

స్మార్ట్ సిటీ పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూసీ పరిధిలోస్మార్ట్ సిటీ పథకం కింద కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టీచర్స్ కాలనీ ఫేజ్-1లో సీసీ రోడ్‌ను, వడ్డేపల్లి బండ్‌పై కొనసాగుతున్న అభివృద్ధి పనులు, 52వ డివిజన్ రాజాజీ నగర్ కల్వర్టు ఇతర పనులను పరిశీలించారు.
News February 19, 2025
వరంగల్: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాలు.. వరంగల్ నగరం కరీమాబాద్‌కు చెందిన రాజేశ్(24) కొంతకాలంగా HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడి స్నేహితుడి పెళ్లి కోసం ఇంటికి వచ్చాడు.ఆదివారం ఉదయం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని కన్పించాడు. మెడపై గాయాలున్నాయనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News February 19, 2025
రేపటి నుంచి కేయూ దూర విద్య సెమిస్టర్ పరీక్షలు

కేయూ పరిధిలోని దూర విద్య ఎంఏ, ఎంకాం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి నిర్వహించనున్నారు. ఈ నెల 20, 22, 24, 27, మార్చి 1వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎంఏ జర్నలిజం, హెచ్ఆర్ఎం మొదటి సెమిస్టర్ ఈ నెల 20, 22, 24, 27, మార్చి 1, 3వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.