News January 13, 2026
వరంగల్: రాజకీయ నాయకుల్లో సంక్రాంతి సంబరం..!

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ముందే సంక్రాంతి పండుగ రావడంతో నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో రాజకీయ వేడి పెరిగింది. నేతలు ఓటర్ల తుది జాబితా పూర్తవడంతో రిజర్వేషన్లపై లెక్కలు వేసుకుంటూ తమ వైపు ప్రజలను తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పండగకు ఊరికి వచ్చిన వారిని ఆత్మీయంగా పలకరిస్తూ, మూడు రోజుల పాటు మద్దతు కూడగట్టే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ ఇదే ఉత్సాహం కనిపిస్తోంది.
Similar News
News February 13, 2026
నర్సంపేటలో బీజేపీ బోణీ

నర్సంపేట మున్సిపాలిటీ పరిధి 28వ వార్డులో బీజేపీ అభ్యర్థి జూలూరి రోజా రాణి విజయం సాధించారు. ఈ ఫలితంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మొదటి సారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన జూలూరి రోజా రాణి తొలి ప్రయత్నంలోనే గెలుపొందారు.
News February 13, 2026
నర్సంపేట నాలుగో వార్డు కాంగ్రెస్ కైవసం

నర్సంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో నాలుగో వార్డు ఫలితం వెలువడింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీరం భరత్ రెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన సహోదరుడు బీరం నాగిరెడ్డిపై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విజయం నాలుగో వార్డులో కాంగ్రెస్ బలాన్ని మరింత పటిష్టం చేయగా, స్థానికంగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
News February 13, 2026
వరంగల్: ఎన్నికల కవరేజీ బిల్లులేవీ సారూ..?

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ప్రక్రియను ఎన్నికల సంఘం వీడియో కవరేజ్ చేయించింది. నామినేషన్ల స్వీకరణ, అభ్యర్థుల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ తదితరాలను కవరేజ్ చేయించిన అధికారులు వీడియో గ్రాఫర్లకు బిల్లులు ఇవ్వడంలో తాత్సారం వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 317 గ్రామ పంచాయతీల్లో కవరేజ్ చేసిన వీడియో గ్రాఫర్లు బిల్లులు అడిగితే అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


