News August 1, 2024
వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రికార్డ్ బ్రేక్!
వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బుధవారం భూ క్రయవిక్రయదారులు పోటెత్తడంతో రికార్డులు బ్రేక్ అయ్యాయి. మంగళవారం 265 దస్తావేజుల రిజిస్ట్రేషన్లు రాత్రి 9 గంటల వరకు పూర్తి కాగా.. ఖజానాకు రూ.2.10 కోట్ల ఆదాయాన్ని సబ్ రిజిస్ట్రార్ అమ్జద్ అందజేశారు. అదే విధంగా బుధవారం రాత్రి 8.30 గంటల వరకు 272 దస్తావేజుల రిజిస్ట్రేషన్లను పూర్తి చేయడంతో ఖజానాకు దాదాపు రూ.2.30 కోట్ల ఆదాయం సమకూరింంది.
Similar News
News December 12, 2024
భీమునిపాదం జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలని వినతి
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరంను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ కలిశారు. గూడూరు మండల పరిధిలోని భీమునిపాదం జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలని కోరారు. స్థానిక గిరిజన యువత ఉపాధి కల్పించుటకు చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై కాసేపు కేంద్రం మంత్రితో హుస్సేన్ నాయక్ చర్చించారు.
News December 12, 2024
కేయూ పరిధిలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ పరిధిలో ఈ నెల 18న జరగాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు. తిరిగి పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ రాజేందర్ తెలిపారు. విద్యార్థులు పరీక్షల వాయిదా విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.
News December 12, 2024
WGL: రైతులను కలవరపెడుతున్న కత్తెర పురుగు!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్న రైతులకు కత్తెర పురుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు 1.10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. ఐదేళ్లుగా ఈ పురుగు క్రమంగా పెరుగుతోంది. దీంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో పంటలను క్షేత్రస్థాయి నుంచి వ్యవసాయ అధికారులు పరిశీలించి రైతులకు సూచనలు చేస్తున్నారు.