News October 29, 2024
వరంగల్: రూ.1,000 పెరిగిన మిర్చి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. తేజ మిర్చి క్వింటాకు సోమవారం రూ.17,000 ధర రాగా.. నేడు కూడా అదే ధర వచ్చింది. అలాగే వండర్ హాట్ మిర్చికి నిన్న రూ.14,000 ధర రాగా.. నేడు రూ.1,000 పెరిగి, రూ.15,000 అయింది. మరోవైపు 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.14 వేల ధర రాగా.. ఈరోజు రూ.15 వేలకు చేరిందని అధికారులు తెలిపారు.
Similar News
News November 7, 2024
కేయూ: డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువును ఈ నెల 11 వరకు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిణి తిరుమలాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం రూ.50తో ఈ నెల 13 వరకు పొడిగించినట్లు చెప్పారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ చూడాలని పేర్కొన్నారు.
News November 7, 2024
వరంగల్: కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు
హనుమకొండ జిల్లా సమీకృత భవనంలో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లతో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, కడియం కావ్య, గుండు సుధారాణి పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ఉమ్మడి వరంగల్ జిల్లాపై ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నట్లు నేతలు తెలిపారు.
News November 6, 2024
WGL: రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి కొండా సురేఖ
వైటిడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై అధికారులకు మంత్రి సూచనలు చేశారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఎంఎయుడి ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, తదితరులు ఉన్నారు.