News February 25, 2025

వరంగల్: రెండు రోజులు మద్యం అమ్మకాలు బంద్

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేటి(మంగళవారం) నుంచి గురువారం వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. నేటి సాయంత్రం 4 గంటల నుంచి 27 తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం అమ్మకాలు ఉండవని అధికారులు తెలిపారు. వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్, మూసివేయాలని కలెక్టర్ సత్య శారద దేవి ఆదేశించారు.

Similar News

News March 22, 2025

కక్కిరాలపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

కక్కిరాలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో స్ట్రెంథనింగ్ ఎఫ్ఎల్ఎన్ ఏఐ టూల్స్‌ను నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ సంబంధించిన అంశాలపై విద్యార్థులు కంప్యూటర్‌ను ఆపరేట్ చేస్తుండగా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధించిన వివిధ తరగతి గదులు, కిచెన్ షెడ్‌ను కలెక్టర్ పరిశీలించారు.

News March 21, 2025

సివెజ్ ప్లాంట్‌కు స్థల పరిశీలన చేయాలి: మేయర్

image

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేయనున్న సివేజ్ ప్లాంట్‌కు స్థల పరిశీలన చేయాలని అధికారులను మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. ఆరేపల్లి ప్రాంతంలో గల అగ్రికల్చర్ కేంద్రం, బుల్లికుంట ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలు చేశారు. ఎస్టీపీల ఏర్పాటుకు గుర్తించబడిన జోన్లలో ఇప్పటికి కొన్ని స్థానాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు.

News March 21, 2025

వరంగల్ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన రైల్వే జనరల్ మేనేజర్

image

వరంగల్ రైల్వే స్టేషన్‌ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, స్టేషన్ పరిసర ప్రాంగణాన్ని సమీక్షించారు. ఏబీఎస్ఎస్‌లో భాగంగా రూ.25.89 కోట్ల వ్యయంతో స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పుడు అనుసరిస్తున్న భద్రత విధానాలను మార్గదర్శకాలను పరిశీలించారు.

error: Content is protected !!