News October 9, 2024
వరంగల్: రేపటి నుంచి ఎనుమాముల మార్కెట్‌కు సెలవులు

వరంగల్ నగరంలోని ఎనుమాముల మార్కెట్‌కు రేపటి నుంచి నాలుగు రోజులు వరుసగా సెలవులు ప్రకటిస్తున్నామని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పి. నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. రేపు దుర్గాష్టమి, ఎల్లుండి మహార్నవమి, 12న విజయదశమి, 13న ఆదివారం సందర్భంగా మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. కాబట్టి రైతులు మార్కెట్‌కు రాకూడదని పేర్కొన్నారు. ఈనెల 14న మార్కెట్ పునః ప్రారంభమవుతుందని తెలిపారు.
Similar News
News May 7, 2025
కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 28 నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశారు. యూనివర్సిటీ పరిధిలోని కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు పరీక్ష ఫీజులు చెల్లించని కారణంగా డిగ్రీ(రెగ్యులర్) 2వ, 4వ, 6వ, డిగ్రీ (బ్యాక్ లాగ్) మొదటి, 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను మరోసారి ప్రకటిస్తామని పేర్కొన్నారు.
News May 7, 2025
వరంగల్: వేర్వేరు కారణాలతో ముగ్గురు సూసైడ్

వేర్వేరు కారణాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. గుంటూరు(ఏపీ)కు చెందిన హర్షియాబేగం(28) ఆర్థిక ఇబ్బందులతో నర్సంపేటలో ఆత్మహత్య చేసుకుంది. కేసముద్రం(MHBD)కి చెందిన రమేశ్(36) కుటుంబ కలహాలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని ఓ వృద్ధురాలు(65-70) వరంగల్ రైల్వేస్టేషన్ యార్డులో రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది.
News May 7, 2025
వరంగల్ జిల్లాలో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఖిలా వరంగల్-42.6, ములుగు రోడ్డు-42.9, సీరోలు(MHBD)-42.4, జఫర్‌గడ్(జనగామ)-42.8, కన్నాయిగూడెం(ములుగు)-43.2, ములుగు 42.5గా నమోదయ్యాయి. మీ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎలా ఉందో కామెంట్ చేయండి.