News August 4, 2024
వరంగల్: రేపటి నుంచి పలు రైళ్ల రాకపోకలు బంద్
మూడో లైన్ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆగస్టు 5 నుంచి 10 వరకు కొన్ని రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను వరంగల్ రాకుండా దారి మళ్లించింది. సికింద్రాబాద్-వరంగల్-గుంటూరు మధ్య రాకపోకలు సాగిస్తున్న గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-వరంగల్-విజయవాడ మధ్య రాకపోకలు సాగిస్తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్, పుష్పుల్ రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు వరంగల్ రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News September 13, 2024
జనగామ: పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించాలి: కలెక్టర్
జనగామ కలెక్టర్ కార్యాలయంలో సీడీపీఓలు, ఐసీడీఎస్ సూపర్వైజర్ లతో ఎస్ఎస్ఎఫ్పీ కార్య నిర్వహణపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ సెంటర్లో టీచర్లు పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల్ని గుర్తించి, ప్రతి 15 రోజులకోసారి సరైన పద్ధతిలో బరువులు, ఎత్తు కొలతలను తీసి ఆన్‌లైన్‌లో సరైన విధంగా నమోదు చేయాలన్నారు. సీడీపీఓలు రమాదేవి, మహేశ్ తదితరులున్నారు.
News September 13, 2024
అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: ఎమ్మెల్సీ
MHBD: బీఆర్ఎస్ ముఖ్య నేతల అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రశ్నించే వారిపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం కొట్లాడుతూనే ఉంటామన్నారు.
News September 13, 2024
ఒడిశా రాష్ట్రం గంజాంలో సమావేశం నిర్వహించిన హుస్సేన్ నాయక్
MHBD: ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో షెడ్యూల్డ్ తెగల కోసం రాజ్యాంగపరమైన రక్షణలు, సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు, మహబూబాబాద్ జిల్లా వాసి జాటోత్ హుస్సేన్ నాయక్ సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు అంకితభావంతో పని చేయాలని హుస్సేన్ నాయక్ పిలుపునిచ్చారు.