News February 14, 2025
వరంగల్: రైతన్నకు తీవ్ర నిరాశ.. భారీగా పడిపోయిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈవారం మొదటి నుంచి పత్తి ధరలు భారీగా పడిపోతున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. బుధవారం రూ.6,950, గురువారం రూ.6,900కి పడిపోయింది. నేడు ఇంకా పతనమై రూ.6820కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే రూ.240 ధర తగ్గడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
Similar News
News September 16, 2025
మిడ్జిల్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో 167 హైవేపై మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. చిల్వర్ గ్రామానికి చెందిన రాములు బైక్ వెళ్తూ ఆగి ఉన్న బొలెరోను ఢీన్నాడు. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిక తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 16, 2025
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TG: రాబోయే 3 గంటల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కరీంనగర్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, భువనగిరిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News September 16, 2025
మియాపూర్: డ్యూటీలో గుండెపోటుతో కండక్టర్ మృతి

మియాపూర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ డిపోలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ కండక్టర్ పండరి గుండెపోటుకు గురై మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. సహోద్యోగులతో సరదాగా మాట్లాడుతూ పండరి వాష్రూమ్కి వెళ్లొస్తానని వెళ్లాడు. వెంటనే అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో సహోద్యోగులు అప్రమత్తమయ్యారు. వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతం అయ్యారు.