News February 14, 2025
వరంగల్: రైతన్నకు తీవ్ర నిరాశ.. భారీగా పడిపోయిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈవారం మొదటి నుంచి పత్తి ధరలు భారీగా పడిపోతున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. బుధవారం రూ.6,950, గురువారం రూ.6,900కి పడిపోయింది. నేడు ఇంకా పతనమై రూ.6820కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే రూ.240 ధర తగ్గడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
Similar News
News March 17, 2025
మెదక్: ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల: DEO

ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రెండు సమయాల్లో కొనసాగుతాయని వివరించారు. అలాగే ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 3 వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులు పరీక్షల కోసం సన్నద్ధం కావాలని సూచించారు. సందేహాలు ఉంటే సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
News March 17, 2025
నల్గొండ: ట్రాక్టర్ టైర్ కింద పడి డ్రైవర్ దుర్మరణం

బోయినపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కడారి వెంకన్న యాదవ్ (48 ) సోమవారం ప్రమాదవశాత్తు ట్రాక్టరు మధ్య టైర్ కింద పడి తీవ్ర గాయాలతో దుర్మరణం చెందాడు. ట్రాక్టర్లో ఇసుక లోడ్ చేసుకుని నల్గొండకు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ డోరు లూజు కాగా దానిని సరిచేసి ట్రాక్టరు డ్రైవింగ్ సీట్లోకి ఎక్కుతున్న క్రమంలో కాలుజారి టైరు కింద పడడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు.
News March 17, 2025
పార్వతీపురం: పది పరీక్షలకు 10,308 మంది హాజరు

పార్వతీపురం మన్యం జిల్లాలో తొలిరోజు 10వ తరగతి పరీక్షలకు 10,308 మంది విద్యార్థులు హాజరైనట్లు కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 10,355 మంది విద్యార్థులకు గాను 10,308 మంది విద్యార్థులు హాజరుకాగా 47 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పట్టణంలోని సెయింట్ పీటర్స్ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.