News February 16, 2025
వరంగల్: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మారంలో ఓ ప్రైవేట్ షాపులో పని చేసే గోపాల రమ్య(35) 3రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ బాధను తట్టుకోలేక చింతలపల్లి రైల్వే స్టేషన్ మధ్య ధర్మారం సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని జీఆర్పీ పోలీసులు తెలిపారు.
Similar News
News November 17, 2025
హసీనాకు మరణశిక్ష.. స్పందించిన భారత్

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు మరణశిక్ష విధించడంపై భారత్ స్పందించింది. ‘పొరుగు దేశ ప్రజల ప్రయోజనాలకు IND కట్టుబడి ఉంటుంది. బంగ్లాలో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం నెలకొల్పేందుకు సహకారం అందిస్తాం’ అని పేర్కొంది. కాగా బంగ్లా అల్లర్ల తర్వాత భారత్కు పారిపోయి వచ్చిన హసీనాకు కేంద్రం ఆశ్రయం కల్పించింది. అయితే ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరుతోంది.

ఈనెల 30 లోగా దరఖాస్తులు పూర్తి చేయండి: కలెక్టర్

ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన ప్రతి పేదవాడు లబ్ధిపొందేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ, గ్రామీణ పథకం కింద ఇంతవరకు 29 వేల 187 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 7,781 మంది వివరాలు సర్వే చేశామని తెలిపారు. ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.