News February 16, 2025
వరంగల్: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మారంలో ఓ ప్రైవేట్ షాపులో పని చేసే గోపాల రమ్య(35) 3రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ బాధను తట్టుకోలేక చింతలపల్లి రైల్వే స్టేషన్ మధ్య ధర్మారం సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని జీఆర్పీ పోలీసులు తెలిపారు.
Similar News
News April 17, 2026
ఖమ్మం: పల్టీ కొట్టిన వరి కోత మిషన్.. డ్రైవర్ మృతి

కల్లూరు మండలం పెద్ద కోరుకొండి శివారులో వరి కోత మిషన్ ప్రమాదవశాత్తు పల్టీ కొట్టడంతో డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్లు గుర్తించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెప్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 17, 2026
పండ్లు తింటున్నారా? FSSAI వార్నింగ్!

మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్లను కృత్రిమంగా పండించేందుకు ‘మసాలా’ (కాల్షియం కార్బైడ్) వాడకంపై FSSAI కఠిన చర్యలు చేపట్టింది. ఈ రసాయనం వల్ల చర్మ వ్యాధులు, గొంతు సమస్యలు, వాంతులు వచ్చే ప్రమాదం ఉండటంతో తనిఖీలు చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇథిలీన్ ద్రావణంలో పండ్లను ముంచడం కూడా నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
News April 17, 2026
నంద్యాల జిల్లాలో మహిళా ఓటర్లే అధికం!

నంద్యాల జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 10,84,706 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. పురుషులు 5,33,161 మంది, మహిళలు 5,51,420 మంది, ఇతరులు 125 మంది ఉన్నారు. నంద్యాల జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి.


