News February 16, 2025
వరంగల్: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మారంలో ఓ ప్రైవేట్ షాపులో పని చేసే గోపాల రమ్య(35) 3రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ బాధను తట్టుకోలేక చింతలపల్లి రైల్వే స్టేషన్ మధ్య ధర్మారం సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని జీఆర్పీ పోలీసులు తెలిపారు.
Similar News
News December 5, 2025
NRPT: వైద్య శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నారాయణపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను, సిబ్బంది వివరాలను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో ఎన్సీడీ ప్రోగ్రాంపై సమీక్షించారు. వైద్య శాఖ పరిధిలోని కార్యక్రమాలను, టీకాలు, మందుల పంపిణీ వంటి వాటిని వంద శాతం పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.
News December 5, 2025
అటు వెళ్లకండి.. నెల్లూరు జిల్లా వాసులకు అలర్ట్.!

నెల్లూరు జిల్లాలోని అన్నీ చెరువులు, రిజర్వాయర్లు, దిత్వా తుఫాను ప్రభావంతో నిండుకుండల్లా ఉన్నాయి. దీంతో పలుచోట్ల పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు రెవెన్యూ సిబ్బంది ప్రజలను చెరువులవద్దకు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో నీటి ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వరద ప్రాంతాల్లో ప్రజలు మోహరించకుండా బారికేడ్లు, పెట్రోలింగ్ వాహనాల ద్వారా గస్తీ కాస్తున్నారు.
News December 5, 2025
CM రేవంత్కు సోనియా అభినందన సందేశం

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 నాటికి రాష్ట్రం $1T ఆర్థికశక్తిగా ఎదగడంలో కీలకం కానుందని INC పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ పేర్కొన్నారు. సమ్మిట్ నిర్వహిస్తున్నందుకు CM రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగమయ్యే వారికి సమ్మిట్ మంచి వేదిక అని తన సందేశంలో పేర్కొన్నారు.


