News March 16, 2025
వరంగల్: రైలు కింద పడి వ్యక్తి మృతి

వ్యవసాయ పనులు చేసుకుని వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. శాయంపేట గ్రామానికి చెందిన రాజేందర్ (33) చింతలపల్లి రైల్వే స్టేషన్ పక్కన గల మొక్కజొన్న చేనుకు వద్దకు వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. శవపరీక్ష అనంతరం శవాన్ని మృతుడి తండ్రి ఐలయ్యకు అప్పగించినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.
Similar News
News December 12, 2025
వరంగల్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

జిల్లాలో 91 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 86.83 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
కట్ర్యాల: ఎన్నికల్లో రూపాయి ఖర్చు చేయకుండా బరిలో గెలిచిన సర్పంచ్

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి రాయపురం రమ్య 9 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. రూ.పది కూడా ఖర్చు చేయకుండా సర్పంచ్‌గా రమ్య ఎన్నికైంది. యువ విద్యావంతురాలైన రమ్యకు కట్ర్యాల ప్రజానికం పట్టం కట్టింది. రమ్య విజయం రాష్ట్ర రాజకీయాలకు రెఫరెండంగా నిలిచింది.