News March 22, 2025
వరంగల్ రైల్వే స్టేషన్ను తనిఖీ చేసిన రైల్వే జనరల్ మేనేజర్

వరంగల్ రైల్వే స్టేషన్ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, స్టేషన్ పరిసర ప్రాంగణాన్ని సమీక్షించారు. ఏబీఎస్ఎస్లో భాగంగా రూ.25.89 కోట్ల వ్యయంతో స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పుడు అనుసరిస్తున్న భద్రత విధానాలను మార్గదర్శకాలను పరిశీలించారు.
Similar News
News February 24, 2026
తూ.గో: ‘ఆ పాల పదార్థాలను వినియోగించవద్దు’

గణేశ్వరరావు నుంచి కొనుగోలు చేసిన పాలు, ఇతర పాల ఉత్పత్తులను వినియోగించరాదని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం స్పష్టం చేశారు. గణేశ్వరరావు సరఫరా చేసిన పాలు కల్తీ అయినట్లు గుర్తించామన్నారు. ఈ పాలు, వాటి ద్వారా తయారైన పెరుగు, కోవా, నెయ్యి, మీగడ వంటి పదార్థాలు ఎక్కడ నిల్వ ఉన్నా వెంటనే తొలగించి, సురక్షితంగా నాశనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News February 24, 2026
పెద్దపల్లి వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా కార్యాలయ రికార్డులు, ఫైళ్లు పరిశీలించినట్లు సమాచారం. సంబంధిత పరిపాలనా అంశాలపై వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ తనిఖీలకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
News February 24, 2026
ఆర్యూబీ నిర్మాణాలకు భూసేకరణ వేగవంతం చేయాలి: జేసీ

భీమవరం కలెక్టరేట్ నుంచి మంగళవారం రైల్వే కన్స్ట్రక్షన్ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులతో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అనుమతులు లభించిన నవాబ్ పాలెం (378), పత్తిపాడు (376), ఆరుగొలను (379) లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల (RUB) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.


