News March 1, 2025
వరంగల్ రైల్వే స్టేషన్‌ను రూ.25.41 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి

వరంగల్ రైల్వే స్టేషన్‌ను రూ 25.41 కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రైలు వినియోగదారులకు సౌకర్యం, సౌలభ్యం అందించడానికి శర వేగంగా పనులు కొనసాగుతున్నాయని, ఈ స్టేషన్‌లో కొత్త ప్లాట్‌ఫారమ్‌లు, ట్రాక్‌లు, సౌకర్యాల జోడించడంతో సహా అనేక విస్తరణలు, ఆధునికీకరణ చేపట్టామని రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News March 18, 2025
ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థికి తీవ్రగాయాలు

ఆత్మకూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరగగా.. ఇద్దరికి గాయాలైన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలు.. పట్టణంలో ఇంటర్మీడియట్ పరీక్ష రాయడానికి ఓ తండ్రి తన కూతురిని బైక్‌పై తీసుకెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 18, 2025
భోగాపురంలో బాంబు పేలి కార్మికుడి మృతి

భోగాపురంలో రాళ్లను పేల్చేందుకు ఏర్పాటు చేసిన బాంబు పేలి కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో భాగంగా రహదారి ఏర్పాటుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించే క్రమంలో బాంబులు పెడుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రామచంద్రపేటకు చెందిన కార్మికుడు కొత్తయ్య మృతి చెందాడు.
News March 18, 2025
అంతరిక్షం నుంచి వచ్చాక స్ట్రెచర్లపైనే బయటకు..

స్పేస్ ఎక్స్ క్రూ క్యాప్సుల్‌లో రేపు తెల్లవారుజామున భూమిపైకి రానున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌పై అందరి దృష్టి నెలకొంది. క్యాప్సుల్ తెరుచుకున్న వెంటనే వీరిని స్ట్రెచర్స్‌లో బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. స్పేస్ నుంచి ఒక్కసారిగా భూమిపైకి రావడం, అంతరిక్షంలో నెలల పాటు ఉండటంతో వీరి శరీరంలో మార్పులు చోటు చేసుకోవడం కారణమని నిపుణులు చెబుతున్నారు. వీరు నడవలేని స్థితిలో ఉంటారని అంటున్నారు.