News March 22, 2024
వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి పై ఉత్కంఠ!
కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన రెండో జాబితాలో WGL లోక్‌సభ అభ్యర్థి పేరు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఆశావహులు, ఎవరికి వారు టికెట్ తమకే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి లోకసభ ఎన్నికల్లో ఆశించిన మేరకు సీట్లు సాధించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. కాగా, కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News September 9, 2024
సదస్సులో పాల్గొన్న మంత్రి సీతక్క
ఆగ్రాలో జరిగిన సామాజిక న్యాయం, సాధికారత సదస్సులో కేంద్ర మంత్రులు డాక్టర్ వీరేంద్ర కుమార్, రాందాస్ అథవాలేతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై సీతక్క మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమంపై దృష్టి సాధించాలని విజ్ఞప్తి చేశారు.
News September 9, 2024
వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నకు రికార్డు ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న మరోసారి రికార్డు ధర పలికింది. గత వారం మార్కెట్లో క్వింటా మొక్కజొన్న ధర రూ.3,015 పలకగా.. నేడు అదే ధర పలికి రికార్డును కొనసాగించింది. మార్కెట్ చరిత్రలోనే ఇంత ధర రావడం ఇదే మొదటిసారి అని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మొక్కజొన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News September 9, 2024
అవినీతి నిర్మూలనే ధ్యేయం: సీఎండీ వరుణ్ రెడ్డి
TGNPDCL సంస్థలోని ఉద్యోగులు భారీ వర్షాలను వరదలను సైతం లెక్కచేయకుండా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి నిబద్ధతతో పనిచేస్తున్నారని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, ఎవరైనా లంచం అడిగితే 92810 33233 నంబరుకు, విజిలెన్స్ విభాగానికి సమాచారం ఇవ్వాలన్నారు. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064లో ఫిర్యాదు చేయాలన్నారు.