News August 6, 2024

వరంగల్: వన మహోత్సవానికి రూ.11.69 కోట్లు

image

వరంగల్ ఉమ్మడి జిల్లాకు వక్రోత్సవం-వన మహోత్సవం కార్యక్రమం కోసం రూ.11.69 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్, హనుమకొండ జిల్లాలకు రూ.5.60 కోట్లు, ములుగుకు రూ.6 కోట్లు మంజూరు చేశామన్నారు. సోమవారం సాయంత్రం హనుమకొండ ఆర్అండ్ బీ అతిథి గృహంలో నగరాభివృద్ధి, సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Similar News

News December 11, 2025

వరంగల్ జిల్లాలో 61% పోలింగ్ @11AM

image

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు గాను జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 61% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పర్వతగిరిలో 65.57, రాయపర్తిలో 59.78, వర్ధన్నపేటలో 57.45% నమోదయింది. కాగా, పోలింగ్‌కు ఇంకా రెండు గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

News December 10, 2025

WGL: పల్లెల్లో ఎన్నికల పండగ..!

image

ఉమ్మడి WGL జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం తొలి విడత జరగనుంది. పల్లెల్లో ఎన్నికల పర్వం పండగ వాతావరణం సృష్టించగా, అభ్యర్థుల గుణగణాల మీద చర్చలు జోరందుకున్నాయి. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా, అభ్యర్థులు పార్టీ కండువాలతోనే ప్రచారం చేస్తూ ఊర్లో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. బయట ఉన్న ఓటర్లకు ఫోన్లు చేసి రానుపోను ఖర్చులు ఇస్తామని చెబుతున్నారు.

News December 10, 2025

WGL: నా గుర్తు స్టూల్.. ఇదిగో నీకో కుర్చీ..!

image

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ల్యాబర్తీ గ్రామంలో ఓటర్లను ఆకర్షించేందుకు వార్డు అభ్యర్థులు తగ్గేదేలే అంటున్నారు. మొన్నటికి మొన్న ఓ పార్టీ క్వార్టర్ మందు ఇస్తే మరో పార్టీ అర కిలో చికెన్ ఇచ్చి ఆకర్షించింది. ఇక మరో వార్డు అభ్యర్థి తనకు గుర్తు కుర్చీ కేటాయించడంతో ఏకంగా ఓటర్లకు కుర్చీలను పంచి పెట్టడం వైరల్‌గా మారింది. ఆటోలో ఇంటింటికీ తిరుగుతూ ఒక్కో ఓటుకు ఒక్కో కూర్చి ఇచ్చి తన గుర్తు ఇదే అంటున్నాడు.