News April 9, 2025
వరంగల్: వారు దరఖాస్తు చేసుకోండి!

ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో పని చేస్తున్న అర్హత కలిగిన అభ్యర్థులు జులై- 2025లో ప్రైవేట్ అభ్యర్థులుగా ఐటీఐ పరీక్షలు రాసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏటూరునాగారం ఐటీఐ ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లలో 3 ఏళ్లు పైబడిన సర్వీస్ సర్టిఫికెట్, ఎంప్లాయ్ గుర్తింపు కార్డు సమర్పించి ములుగు రోడ్డు వరంగల్ కార్యాలయంలో ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News November 18, 2025
VKB: పాఠశాలల్లో బాలల సభలు నిర్వహించాలి: కలెక్టర్

మండలంలోని పాఠశాలల్లో బాలల కోసం బాలసభలు నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం వికారాబాద్ డీపీఆర్సీ భవనంలో బాలసభల నిర్వహణకు పంచాయతీ సెక్రెటరీలు, మండల పంచాయతీ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ నెల 20న బాలల సభలు నిర్వహించాలన్నారు. బాలల సభల ద్వారా విద్యార్థులకు అనేక విషయాలపై అవగాహన చేయాలన్నారు.
News November 18, 2025
గురువారం గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం: కలెక్టర్

గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ (ఫిర్యాదుల స్వీకరణ), ఉద్యోగవాణి కార్యక్రమం యథాతథంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు వారి యొక్క సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆయన అన్నారు. కావున, జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను ఇవ్వడానికి కలెక్టరేట్కు రావచ్చని కలెక్టర్ కోరారు.
News November 18, 2025
రేపు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.


